దళారులను అరికట్టాల్సిన ప్రభుత్వం.. మొత్తం వ్యవస్థనే దళారులకు అప్పజెప్పిందని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడులో నిర్వహించిన పసుపు చైతన్యం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. చేతికొచ్చిన పంట అకాల వర్షంతో తడిసి రైతుకు తీరని కష్టాన్ని మిగిల్చిందని దేవినేని అన్నారు. పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయ పంటలన్నీ అకాల వర్షాల కారణంగా రైతులకు నష్టాలను తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామని పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలిచ్చిన ప్రభుత్వం..రైతులను గాలికొదిలేసిందని దేవినేని ధ్వజమెత్తారు. తడిసిన పంటలను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి పంటను వెంటనే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడతామంటూ సంతకాల కోసం వస్తే ఎవరు సంతకాలు పెట్టొద్దని రైతులకు సూచించారు.
ఇదీచదవండి
ఆస్తి పన్ను చట్టానికి సవరణ...రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్ను