కృష్ణా నదీ జలాలపై తెలంగాణ మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడుతుంటే..వైకాపా ప్రభుత్వం నోరుమెదపటం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. జల వివాదంపై సంబంధిత మంత్రులు మాట్లాడకుండా..సజ్జలతో మాట్లాడిస్తున్నారని ఆక్షేపించారు. ఈ అంశంపై మాట్లాడటానికి సజ్జల ఎవరని ప్రశ్నించారు. వైఎస్‌ను నోటికొచ్చినట్లు తిడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, విల్లాలు కాపాడుకోడానికే వారు నోరు మెదపడం లేదని విమర్శించారు.
ఇదీ చదవండి
Rayalaseema Lift Irrigation Project: కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ