కరోనాతో ప్రజలు చనిపోతుంటే.. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి రాజప్రసాదం వదిలి బయటకి రావడంలేదని.. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. కేంద్రం చేసిన చట్టాన్ని సీఎం జగన్ లెక్కచేయట్లేదని మండిపడ్డారు. యనమల ఇచ్చిన సలహాలను గవర్నర్ కార్యాలయం పరిశీలించాలని కోరారు. 14 నెలల్లో సీఎం జగన్ ఒక్క సారి కూడా.. అమరావతి అన్న పేరును ఎత్తలేదని పేర్కొన్నారు. రైతులు త్యాగాలు చేసిన భూముల్లో కూర్చుని.. సీఎం అమరావతిపై ఒక్కమాట మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం పంపిన బిల్లులను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లాలని గవర్నర్ను కోరారు. గవర్నర్ అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని, ఈ బిల్లులను తిరస్కరించాలని దేవినేని ఉమా విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: గవర్నర్ వద్దకు ఆ 2 బిల్లులు.. తిరుగుతున్నాయి ఎన్నో మలుపులు