తెలుగుదేశం పార్టీలో తన ఎదుగుదల ఓర్వలేని కొందరు పనిగట్టుకుని తాను పార్టీని వీడనున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని దేవినేని అవినాష్ మండిపడ్డారు. తనకు పార్టీ మారే ఆలోచన ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. ఈ వదంతులను నమ్మవద్దని పార్టీ కార్యకర్తలను, అభిమానులను కోరారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతానని, దేవినేని నెహ్రూ ఆశయాల సాధనకు పాటుపడతానని అవినాష్ వెల్లడించారు. తెదేపా కార్యకర్తలకు, దేవినేని అభిమానులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని తేల్చిచెప్పారు.
ఇదీ చూడండి