ETV Bharat / state

కేసులు లక్షదాటుతుంటే ఏం చేస్తున్నారు?: దేవినేని ఉమ - devineni uma fired on ycp govt

రాష్ట్రలో కరోనా కేసులు లక్ష దాటుతుంటే ప్రభుత్వ ఏం చర్యలు తీసుకుంటోందని మాజీ మంత్రి దేవినేని ఉమా నిలదీశారు. గుంటూరు జీజీహెచ్ లో 30కి పైగా మృతదేహాలు అనాథ శవాలుగా ఉండటం దారుణమన్నారు.

devi neni uma fired on ycp govt about corona actions

author img

By

Published : Jul 27, 2020, 12:35 PM IST

గుంటూరు జీజీహెచ్​లో 30కిపైగా మృతదేహాలు అనాథ శవాలుగా ఉండటం దారుణమని తెదేపా నేత దేవినేని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే.. సీఎం జగన్ ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. జే-ట్యాక్స్ వసూళ్ల కోసం మద్యం విక్రయాలు రాత్రి 9 వరకు అనుమతులిచ్చారని దుయ్యబట్టారు. తాడేపల్లి రాజప్రసాదం దాటి ముఖ్యమంత్రి బయటకు ఎందుకు రావటం లేదని నిలదీశారు.

రాష్ట్ర సరిహద్దుల్లో వైకాపా నేతలు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చి అధికధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. క్వారంటైన్ కేంద్రాల్లో భోజనవసతులు నాశిరకం ఆహారం అందిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి

అంత్యక్రియలను అడ్డుకోవద్దు- అది మన సంస్కృతి కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.