కోడి పందేల నిర్వహణకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు.. నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నూజివీడు డీఎస్పీ ఆధ్వర్యలో సిబ్బంది సాయంతో అంపాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కోడి పందెం బరులు ధ్వంసం చేశారు. పందేల నిర్వహణకు సమకూర్చిన సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిర్వాహకులను బైండోవర్ చేశారు.
అనంతపురం జిల్లాలో...
అనంతపురం జిల్లా తలుపుల మండలం గుడాల గొంది వద్ద తొమ్మిది మంది కోడి పందెం రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. పందెం ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న కదిరి గ్రామీణ సీఐ మధు, గాండ్ల పెంట ఎస్ఐ గురు ప్రసాద్ రెడ్డి.. జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 కత్తులను, 1868 రూపాయల నగదు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:
విజయవాడలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయంలో అనిశా అధికారుల సోదాలు