హజ్ యాత్రకు వెళ్లే హాజీల సౌకర్యార్థం ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా సచివాలయంలో ప్రచార పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 2,602 మందిని హజ్ యాత్రకు పంపించే అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత మూడేళ్లుగా ఈ యాత్రకు కోటా కన్నా తక్కువ మంది వెళ్లారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యంపై విస్తృత ప్రచారం జరగాల్సి ఉందని అంజాద్ భాషా అన్నారు. హజ్ యాత్రకు వెళ్లే వారిలో మూడు లక్షల లోపు ఆదాయం కలిగిన హాజీలకు 60 వేల ఆర్థిక సాయం, అంత కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు నిర్ణయించామన్నారు. యాత్రికులు ఇకపై గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వెళ్లే అవకాశం ముఖ్యమంత్రి కల్పించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి :