గుడివాడలో ప్రముఖ వ్యాపార వేత్త, విద్యావేత్త అయిన వేములపల్లి వెంకటేశ్వర రావు అలియాస్ నందివాడ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, కటారి ఈశ్వర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాటుగా పలువురు ప్రముఖులు, పలు రాజకీయ పార్టీల నాయకులు నివాళులర్పించారు. గుడివాడలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థుల ఉజ్వల భవితకు బాటలు వేసిన గొప్ప విద్యావేత్త నందివాడ బాబు అని మంత్రి కొడాలి నాని గుర్తు చేశారు. ఆక్వా రైతుగా గుర్తింపు పొంది, పారిశ్రామికవేత్తగా వందలాది మందికి ఉపాధి కల్పించిన నందివాడ బాబు మృతి బాధాకరమని పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి..
'ఎన్నికలు జరుగుతున్నాయా..? లేక వైకాపా ఎమర్జెన్సీ ప్రవేశపెట్టిందా..?'