ETV Bharat / state

కరోనా భయం.. విటమిన్ మందులకు పెరిగిన డిమాండ్ - విజయవాడలో కరోనా కేసులు

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో డాక్టర్లు.. రోగనిరోధక శక్తి పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో విటమిన్ సి, విటమిన్ డీ3, జింక్, పల్స్ ఆక్సిమీటర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వినియోగదారులు మెడికల్ షాపుల వద్ద క్యూకడుతున్నారు. రోజుకు 500 పల్స్ ఆక్సీమీటర్స్ విక్రయిస్తున్నామని దుకాణదారులు చెపుతున్నారు.

demand for vitamin
demand for vitamin
author img

By

Published : Jul 15, 2020, 7:00 AM IST

కరోనా..ఈ పేరు వినగానే ఇప్పుడు అందరూ వణికిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవాలంటే.. రోగ నిరోధక శక్తి పెంచుకోవటమే ప్రత్యామ్నాయ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సి, విటమిన్ డి, జింక్ ఔషధాలు వినియోగించ వచ్చని వైద్యులు చెబుతున్నారు. దీంతో కృష్ణా జిల్లాలో ఈ మందులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.

గతంలో ప్రతిరోజు 10 మంది వీటి కోసం వచ్చే వాళ్లని.. ఇప్పుడు 100 మందిలో 60 మంది విటమిన్ సి,డి, జింక్ ఔషధాలను కొనుగోలు చేస్తున్నారని మెడికల్ షాపుల వారు చెప్తున్నారు. ప్రస్తుతం డిమాండుకు తగ్గ సప్లయ్ ఉందంటున్నారు. మరోవైపు రోగనిరోధక శక్తి నిచ్చే ఔషధాలతో పాటు పల్స్ ఆక్సీ మీటర్స్, మినీ ఆక్సిజన్ సిలిండర్స్ కు సైతం డిమాండ్ పెరిగింది. గతంలో 50 పల్స్ ఆక్సీమీటర్లు విక్రయించిన ఒక దుకాణంలో 500 విక్రయిస్తున్నామని యజమానులు చెప్తున్నారు.

వృద్దులు, చిన్నారులు ఉన్న కుటుంబాల్లో మెడికల్ కేర్ కిట్ల పట్ల అవగాహన పెరిగిందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఆక్సిజన్, పల్స్ రేటు తగ్గితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తుండటంతో పల్స్ ఆక్సీమీటర్లు, అందుబాటులో ఉంచుకుంటున్నామని కొందరు అంటున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా రోగనిరోధక శక్తి పెంచుకోవడంతో పాటు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: పోలీసునూ వదలని కోవిడ్... వైరస్ సోకి సీఐ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.