ETV Bharat / state

ఆధ్యాత్మికవేత్తలూ.. కరోనా కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పించండి: గవర్నర్ - governor webinar with spirutualists latest News

కరోనా కల్లోలం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విపరీత విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మత, ఆధ్యాత్మిక సంస్థలు ముందుకురావాలని గవర్నర్ బిశ్వభూషణ్ కోరారు. ప్రజలెవరూ అపోహాలకు లోను కాకుండా ఉండాలంటే కరోనా నియంత్రణపై జనాలను చైతన్య పర్చాలని ఆధ్యాత్మిక వేత్తలనకు విజ్ఞప్తి చేశారు.

ఆధ్యాత్మికవేత్తలూ.. కరోనా కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పించండి : గవర్నర్

author img

By

Published : May 3, 2021, 9:12 PM IST

ఆధ్యాత్మికవేత్తలూ.. కరోనా కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పించండి : గవర్నర్

కరోనా కట్టడికి స్వీయ రక్షణ విధానాలను పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని గవర్నర్ బిశ్వభూషణ్.. వివిధ మత, ఆధ్యాత్మిక సంస్థలకు సూచించారు. ఈ మేరకు విజయవాడలోని రాజ్ భవన్ నుంచి ఆయన వెబినార్‌ సమావేంలో పాల్గొన్నారు. ప్రజల జీవితాల్లో మత విశ్వాసాలకు ఒక ప్రత్యేకత ఉందని.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆందోళ చెందకుండా, ప్రశాంతంగా ఉండటానికి.. ప్రవచనాలు, ప్రసంగాల ద్వారా బాధితుల్లో మనస్తైర్యం నింపాలని విజ్ఞప్తి చేశారు.

స్వీయ రక్షణ పాటించాలి..

మానవాళి మొత్తానికి కొవిడ్‌ వ్యాప్తి సవాలుగా మారిందన్నారు. మాస్క్ ధరించడం సహా భౌతిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి చర్యల ద్వారా మహమ్మారి కల్లోలాన్ని నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఇళ్లల్లోనే ఉండటం మేలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అనవసరమైన ప్రయాణాలకు సైతం దూరంగా ఉండాలని.. పండుగలు, ఇతరత్రా నివాసాల్లోనే జరుపుకునేలా జనాలకు వివరించాలని కోరారు.

పండుగలు, వేడుకలు ఇళ్లల్లోనే..

శుభకార్యాలు, ఇతర వేడుకలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని.. లేదా పరిమిత సభ్యులతో కొవిడ్ మార్గదర్శకాలను కఠినంగా పాటిస్తూ నిర్వహించుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. కొవిడ్ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల ఇంట్లో లేదా ఆస్పత్రుల్లో వెంటనే చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రత తగ్గి ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చన్నారు.

ఇంతగా ఎవరూ ఊహించలేదు..

కరోనా రెండో దశ తీవ్రతను ఇంతగా ఎవరూ ఊహించలేదని.. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా వ్యాప్తిని అరికట్టవచ్చని జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఛైర్మన్‌, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన జీయర్ స్వామి తెలిపారు. ప్రజలు ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోవాలని, బయటి ఆహారానికి సాధ్యమైనంత దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

వివిధ అవయవాలపై దాడి..

కాస్మిక్ ఎనర్జీ ద్వారా మానవులపై ప్రకృతి విసిరిన సవాల్‌ కొవిడ్‌-19 అని, ఈ వైరస్ మానవ శరీరంలోని వివిధ అవయవాలపై దాడి చేయడం ద్వారా వివిధ లక్షణాలతో మార్పు చెందుతోందని శ్రీ పీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానందస్వామి అభిప్రాయపడ్డారు. ఆవు పిడకలను కాల్చడం, వేడినీరు తాగడం, ఆవిరి పీల్చడం, ప్రాణాయామం చేయడం, చల్లని వస్తువులకు దూరంగా ఉండటం, సూర్యరశ్మిలో ఉండటం వంటి ఆయుష్ పద్ధతులను అనుసరించడం ద్వారా రోగులు వ్యాధి నుంచి కోలుకునేందుకు ట్రస్ట్ సహాయపడిందన్నారు.

మత పెద్దల పాత్ర అవసరం..

కార్యక్రమంలో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ప్రతినిధులు, గురుద్వారా సత్సంగ్, జైన్‌సమాజం నిర్వాహకులు, బ్రహ్మకుమారీలు, బిషప్ చర్చి ప్రతినిధులు, జైన్ సమాజ్ సభ్యులు పాల్గొని.. ప్రజల్లో కరోనా నియంత్రణపై అవగాహన కల్పించేందుకు తమవంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

కరోనా నియంత్రణ దిశగా మరిన్ని నిబంధనలు.. ఎల్లుండి నుంచే అమలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.