విజయవాడలో ఈనాడు-కేఎల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో దశ - దిశ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోటీ ప్రపంచంలో యువత తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చుదిద్దుకునేందుకు నిర్దిష్టమైన ఆలోచన ఉండాలని కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ జె.శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 24 నుంచి 26 వరకు ప్రతిభాపరీక్ష నిర్వహిస్తున్నామనీ.. ఇందులో మార్కులు, గ్రేడింగ్ ఆధారంగా ఫీజుల్లో రాయితీలు ఉంటాయని కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. కనీస ఫీజులు చెల్లించలేమనుకుంటే బ్యాంకు రుణాలు కూడా కల్పిస్తున్నట్టు వివరించారు.
ఇంటర్మీడియట్ తర్వాత ఏయే కోర్సులను ఎన్నుకోవటం ద్వారా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే వివరాలను శ్రీనివాసరావు తెలిపారు. ఏటా వేలమంది ఇంజినీరింగ్ పట్టాలతో విద్యార్థులు బయటకు వస్తున్నా... ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నది కొందరేనంటూ...అందుకు కారణాలను వివరించారు. ఇంజినీరింగ్లో చేరిన తొలి ఏడాది నుంచే.. ఆ వృత్తి పట్ల ఒక దీక్షగా పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే ఫలితం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎల్‌యూ నుంచి సత్యనారాయణమూర్తి... చైతన్య కళాశాల డీన్ మురళీరావు, ఈనాడు విజయవాడ యూనిట్ ఇన్‌ఛార్జ్ జి.ఆర్.చంద్రశేఖర్ తదితరులు పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.
ఇదీ చదవండి