అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ.. విజయవాడ ధర్నా చౌక్‌లో దళిత, గిరిజన, బహుజన సంఘాలు నిరసనకు దిగాయి. తక్షణమే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్ట్రాసిటీ కేసు నమోదు చేసి, శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే...ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి...