క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... ఇనగుదురుపేట స్టేషన్ పరిధిలోని గొడుగుపేటలో ఓ ఇంట్లో క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు మెరుపుదాడి చేశారు.
ఆరుగురు ప్రధాన నిందితులతోపాటు 12 మంది సహచర నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 5 లక్షల 24 వేల నగదుతో పాటు 12 సెల్‌ఫోన్‌లు, పందేల నిర్వహణకు ఉపయోగిస్తున్న టీవీ, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
ఇదీచదవండి