ప్రజలపై విద్యుత్ భారం మోపడం సంక్షేమ రాజ్యంలో భాగమా అంటూ సీపీఎం నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. పెంచిన కరెంట్ బిల్లులకు వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళనలు చేశారు. పార్టీ నేత సీహెచ్. బాబురావు మాట్లాడుతూ... ప్రజలపై ఛార్జీలు భారం మోపి.. సంక్షేమ పథకాలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
ఏడాది పాలనలో 90 శాతం హామీలు నెరవేర్చినట్లు తప్పుడు ప్రచారాల చేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు 200 యూనిట్ల లోపు వారికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని నిలదీశారు. లాక్ డౌన్ కష్టాలకోర్చి ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే.. వారికిచ్చే బహుమతి ఇదేనా అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి.. తిరుమలను సందర్శించిన ఎస్పీ రమేష్‌రెడ్డి