స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు పేదలకు అల్పాహార పంపిణీ చేశారు. ఇళ్లకే పరిమితమైన ప్రజానీకం పరిస్థితి రోజురోజుకు అస్తవ్యస్తంగా మారుతుందని వ్యాఖ్యానించారు. రేషన్ ద్వారా తెల్లకార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో 55 వేల మందికి పైగా భోజనం పంపిణీ చేసినట్లు తెలిపారు. పేదలకు అల్పాహారాలు, మాస్కులు పంపిణీ చేస్తున్న దాతలకు, సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవీ చూడండి...