ETV Bharat / state

'కొత్త విద్యుత్ టారిఫ్​ను నిలిపివేయండి' - అజిత్​సింగ్ నగర్ స్థానికుల ఆందోళన

విద్యుత్ బిల్లుల రీడింగ్​లో లోపాలున్నాయంటూ విజయవాడ అజిత్​సింగ్ నగర్ వాసుల ఆందోళనకు సీపీఎం నేత సీహెచ్ బాబురావు మద్దతు తెలిపారు. కొత్త విద్యుత్ టారిఫ్​ను నిలిపిపేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

cpm agitation in vijayawada
అజిత్​సింగ్ నగర్ స్థానికుల ఆందోళన
author img

By

Published : May 11, 2020, 6:54 PM IST

విద్యుత్ బిల్లుల రీడింగ్​లో లోపాలు జరిగాయంటూ ఆందోళనకు దిగిన విజయవాడ అజిత్​సింగ్ నగర్​ వాసులకు సీపీఎం నేత సీహెచ్ బాబురావు మద్దతు తెలిపారు. స్థానికులతో కలిసి అజిత్​సింగ్ నగర్ విద్యుత్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. విద్యుత్ బిల్లులో తేడాలు సరి చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విద్యుత్ టారిఫ్ అమలును నిలిపివేయాలని కోరారు. పెనాల్టీలు, కస్టమర్ ఛార్జీలు రద్దు చేయాలన్నారు. 2 వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారందరికీ పూర్తిగా విద్యుత్ ఛార్జీలను మూడు నెలల పాటు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగ్ నగర్, వించిపేటలో పేదలకు ఆహారాన్ని పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: నష్టాల్లో పసుపు సాగు... పట్టించుకోరా సారూ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.