పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ, కృష్ణా జిల్లా నందిగామ ట్రాన్స్కో కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, కరెంటు ఛార్జీలు పెంచి పేద ప్రజలపై మోయలేని భారం మోపిందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై కరెంటు ఛార్జీలు పెంచటం దారుణమన్నారు. పెంచిన విద్యుత్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: '4 నెలల విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి'