అర్హులకు టిడ్కో గృహాలను కేటాయించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. కృష్ణాజిల్లా విజయవాడలోని దాసరి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. నిర్మాణం పూరైన ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందంటూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. పేదలను ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తున్నారని ఆయన అన్నారు.
పట్టణాల్లో సెంటు స్థలం ఇస్తామంటున్న ప్రభుత్వం.. ఆ కొంచెం భూమిలో నివాసయోగ్యమైన ఇంటిని ఎలా నిర్మిస్తారని నిలదీశారు. దాదాపు ఏడు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 2 లక్షల 60 వేల మందికి మాత్రమే ఇళ్లు ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు. టిడ్కో గృహ సముదాయాల దగ్గర సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'బ్లాక్ చెయిన్'తో గిన్నీస్కెక్కిన బెజవాడ యువతి