దిల్లీ అగ్నిగుండం కావడానికి శాంతిభద్రతల సమస్య కారణం కాదని, ఉద్దేశపూర్వకంగా భాజపా, ఆర్ఎస్ఎస్ కలిసి అల్లర్లు సృష్టించి, అధికారంలోకి రావాలని యత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అల్లర్లకు కారణమైన ముగ్గురు భాజపా నాయకులపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన.. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మురళీధరన్ని బదిలీ చేయించారని వెల్లడించారు. కన్హయ్యపై ఉన్న కేసులను బయటికితోడి అరెస్టు చేయాలని కుట్రపూరితంగా ఆలోచిస్తున్నారని విమర్శించారు. ప్రజాకోర్టులో తాను నిర్దోషినని కన్హయ్య కుమార్ నిరూపించుకున్నాడని, న్యాయ స్థానాల్లోనూ నిర్దోషిగా నిరూపించుకుంటాడన్న నమ్మకం తమకు ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి...