ETV Bharat / state

తలగడదీవి జిల్లా పరిషత్​ హైస్కూల్​లో కరోనా కలకలం - తలగడదీవి ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయులకు కొవిడ్ పాజిటివ్​

కృష్ణా జిల్లా తలగడదీవిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలవరం రేపుతోంది. పాఠశాలకు చెందిన ముగ్గురు టీచర్లకు వైరస్ సోకడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

covid tragedy at zphs of talagadadeevi
తలగడదీవి జెప్పీహెచ్​ఎస్​లో కరోనా కలకలం
author img

By

Published : Apr 10, 2021, 5:48 PM IST

కృష్ణాజిల్లా నాగాయలంక మండలం తలగడదీవిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్​గా తెలింది. దీంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. వైరస్ బారిన పడిన టీచర్లు విజయవాడలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

పాఠశాలలో మొత్తం 286 మంది విద్యార్థులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే శుక్రవారం 150మంది విద్యార్థులకు కొవిడ్ టెస్టులు నిర్వహించగా.. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది. జిల్లా విద్యాశాఖ సత్వరమే మెరుగైన చర్యలు తీసుకోవాలని పీఎంసీ ఛైర్మన్ పి. సురేష్ విఙ్ఞప్తి చేశారు. పాఠశాలలో శానిటైజేషన్ చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి:

సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు

మహిళ ఆత్మహత్య- అత్తవారింటికి బంధువులు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.