కృష్ణాజిల్లా నూజివీడు పట్టణం, విజయవాడ రూరల్‌లో కోవిడ్- 19 కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి వైద్యులు... వివేక గిష్, రుచిగలాంగ్లతో కూడిన ప్రత్యేక వైద్య బృందం నూజివీడులోని కోవిడ్ స్వాబ్ కలెక్షన్ సెంటర్, ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని క్వారంటైన్ సెంటర్, ముసలి రామ మందిరం పరిసరాలు, గాంధీనగర్ కంటైన్మెంట్ ఏరియా, విజయవాడ గూడవల్లిలోని నారాయణ కాలేజీ క్వారంటైన్ సెంటర్లను పరిశీలించింది.
ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని క్వారంటైన్ కేంద్రం, రెడ్ జోన్ ప్రదేశాలలో అధికారులు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై వైద్య బృందం సంతృప్తిని వ్యక్తం చేయగా... నారాయణ కాలేజీ క్వారంటైన్ సెంటర్‌ను స్టేట్ మోడల్ కోవిడ్ సెంటర్‌గా ప్రకటించింది. జిల్లా సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, డీఎస్పీ శ్రీనివాసులు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ నరేంద్ర సింగ్‌లు కేంద్ర బృందానికి వివరాలను అందజేశారు.
ఇదీ చదవండి: