ETV Bharat / state

క్షణికావేశం..అత్తను రోకలితో కొట్టి చంపిన కోడలు

కుమారుడు చనిపోయినప్పటికీ... కోడలిని ప్రేమగా చూసుకుంది ఆ అత్త. అంతా సంతోషంగా గడుస్తోందనుకుంటున్న సమయంలో చిన్న వివాదం వారి మధ్య దూరాన్ని పెంచింది. ఒకరిపై మరొకరు మాటల దాడులు చేసుకోవటం దినచర్యగా మారింది. నేడు అలాంటి వివాదమే ఇద్దరి మధ్య జరిగింది. చివరికి ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఆవేశంలో అత్తను రోకలితో కొట్టింది కోడలు. దీంతో అత్త ప్రాణాలు విడిచింది.

death
ఆవేశంలో అత్తను రోకలితో కొట్టి చంపిన కోడలు
author img

By

Published : Dec 4, 2020, 8:09 PM IST

ఓ కోడలు అత్తపై రోకలితో దాడి చేయటంతో... ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కృష్ణా జిల్లా పెనమలూరులోని పునాదిపాడుకు చెందిన గొడ్డళ్ల తిరుపతమ్మ భర్త వీరయ్యతో కలసి నివసిస్తోంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 8 ఏళ్ల క్రితం కుమారుడు మృతి చెందగా... కోడలు పద్మావతి అత్తమామల ఇంటి వద్దనే ఉంటోంది.

అత్త తిరుపతమ్మకు, కోడలు పద్మావతికి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో కోడలిని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అత్త తరచూ వేధిస్తుండేది. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం కూడా వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన కోడలు పద్మావతి... అత్త తలపై రోకలితో కొట్టింది. తీవ్రగాయాలతో ఉన్న ఆమెను బంధువులు కంకిపాడు సిహెచ్​సికి తరలించారు. అప్పటికే తిరుపతమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తిరుపతమ్మ కుమార్తె వేముల రమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ...భలే బుడతడు...198 దేశాల రాజధానులు ఇట్టే చెప్పేస్తాడు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.