విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయ సిబ్బందికి కరోనా భయం పట్టుకుంది. ఆలయ కార్యనిర్వహణ అధికారి సురేశ్ బాబుకు పాజిటివ్ రావటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం ఆయన పాలకమండలి సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఈవోతో సన్నిహితంగా మెలిగిన వారంతా హోం క్వారంటైన్లో ఉన్నారు.
అమ్మవారి ఆలయంలో భక్తుల దర్శన వేళల్లో మార్పులు చేశారు. నేడు శ్రావణ శుక్రవారం అయినందున అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయ సిబ్బందిలో కొందరికి కరోనా రావడం... ఈవో ఆసుపత్రిలో చేరడం.. ఓ వేదపండితుడు మృతి చెందడం వల్ల సిబ్బంది భయపడుతున్నారు. భక్తులను క్షుణ్నంగా తనిఖీ చేయటంతోపాటు ఎక్కువసేపు ఆలయ పరిసరాల్లో ఉండకుండా పంపించేస్తున్నారు.
ఇవీ చదవండి..
ఉప్పొంగి వస్తున్న కృష్ణమ్మ... జూరాల, తుంగభద్రకు పెరిగిన ప్రవాహం