తొలి విడత వ్యాక్సినేషన్ సజావుగా సాగుతోందని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు 42 రోజుల వరకు జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కరోనా నుంచి పూర్తి స్థాయిలో టీకా రక్షణ కల్పిస్తుందా అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ నెల 28 తర్వాత టీకా ఉత్పత్తిని అనుసరించి... రెండో దశ వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఇస్తున్న టీకా పూర్తి సురక్షితమని... ప్రజలకు చౌకగా వ్యాక్సిన్ సరఫరా కావటం సంతోషదాయకమని ఈటీవీ భారత్ ముఖాముఖిలో రాంబాబు తెలిపారు.
ఇదీ చదవండి