కృష్ణాజిల్లా నందిగామలో కరోనా వ్యాక్సిన్ మహోత్సవానికి భారీగా జనం హాజరయ్యారు. నందిగామలో మూడు వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రారంభించారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద కనీసం కరోనా వ్యాపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం గుంపులు గుంపులుగా ఉండటం, క్యూలైన్లలో భౌతిక దూరం లేకుండా ఉన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేయాలని ప్రజలు అధికారులను కోరుకుంటున్నారు.
ఇదీ చూడండి . వేగంగా వ్యాపిస్తున్న బ్రిటన్ వైరస్- మరణ ముప్పు తక్కువే!