ETV Bharat / state

యువతపై కరోనా దెబ్బ...పెరగనున్న నిరుద్యోగం రేటు - ఐఎల్​ఓ తాజా వార్తలు

కొన్ని సమస్యలు అంతే..! పరిష్కరించటానికి మార్గాలున్నా దశాబ్దాల పాటు కొనసాగుతూనే ఉంటాయి. ఇందుకు కారణమేంటి అంటే...ఆ సమాధానం ఏడు చేపల కథనే తలపిస్తుంది. అలాంటి సమస్యల్లో ఒకటి...నిరుద్యోగం. తరాలుగా ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. నిట్టూర్పులతోనే ఆ చర్చ ముగుస్తుంది. నిరుద్యోగిత ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ...అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఇప్పుడీ సమస్యకు కరోనా తోడైంది. వైరస్ వ్యాప్తితో సుదీర్ఘ లాక్‌డౌన్‌ ప్రకటించటం... ఉద్యోగ, ఉపాధిరంగాలను దెబ్బ తీసింది. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికులు తీవ్రంగా నష్ట పోయారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి ఉపాధి అవకాశాలపై, ఆశలపై నీళ్లు చల్లింది కరోనా. ప్రపంచవ్యాప్తంగా యువ జనాభాపై ఈ ప్రభావం ఎక్కువ ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ తేల్చి చెప్పటం...సమస్య తీవ్రతకు నిదర్శనం.

Corona Effect on Unemployment
నిరుద్యోగంపై కరోనా ప్రభావం
author img

By

Published : Jun 11, 2020, 5:30 PM IST

ప్రతి ఆరుగురు యువ జనాభాలో ఒకరు ఉపాధికి దూరం..! ఉద్యోగం చేస్తున్న వారి పని గంటల్లో 23% కోత..! ఆ మేరకు తగ్గిన వేతనం..! ఇదీ ప్రపంచవ్యాప్తంగా కరోనా మిగిల్చిన నష్టం. ప్రపంచ వ్యాప్తంగా అమల్లో ఉన్న సుదీర్ఘ లాక్‌డౌన్‌ ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగానే కనిపిస్తోంది. అన్నింటికన్నా ఉపాధి రంగం బాగా ప్రభావితమైంది. అసంఘటిత రంగంలోని చిరుద్యోగులపై, ఇతర ఉపాధి అవకాశాలపై కోలుకోలేని దెబ్బ పడింది. ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు ఇదే విషయం వెల్లడించాయి కూడా. అంతర్జాతీయ కార్మిక సంస్థ-ఐఎల్​ఓ సైతం ఇదే ధ్రువీకరిస్తోంది. కరోనా కారణంగా... యువజనాభా పైనే ఎక్కువగా ప్రభావం పడిందని తేల్చి చెప్పింది...ఐఎల్​ఓ . ఫిబ్రవరి నుంచి నిరుద్యోగ రేటు కూడా గణనీయంగా పెరుగుతోందని వెల్లడించింది.

యువతపై కరోనా దెబ్బ..

యువత ఉపాధి అవకాశాలు దెబ్బ తీయటమే కాదు...విద్య, నైపుణ్యాలు పెంచుకునేందుకు అనువైన శిక్షణ లాంటి పలు అంశాలపైనా ప్రభావం చూపింది కరోనా. ఫలితంగా చాలా మంది యువతీ యువకులు...కాయకష్టం ఎక్కువగా ఉండే ఉద్యోగాలు చేసేందుకూ వెనకాడటం లేదు. 2019లోనే ప్రపంచవ్యాప్తంగా యువ జనాభాలో నిరుద్యోగ రేటు 13.6%గా నమోదైంది. అదే ఇప్పటి వరకు అత్యధికం. 26 కోట్లకుపైగా యువత ఏ ఉద్యోగావకాశాలకు దూరంగా ఉన్నారని ఐఎల్​ఓ చెబుతోంది. 15-24 ఏళ్ల మధ్య వయసుల్లో కొందరు ఉద్యోగం చేస్తున్నా.. వారిని తక్కువ వేతనాలు, ప్రమాదకర పని ప్రాంతాలు లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇప్పుడు కరోనాతో ఈ పరిణామాలు మరింత ఆందోళనకరంగా మారాయి. ఈ లాక్‌డౌన్‌ ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగే అవకాశముందని అంచనా వేస్తోంది..ఐఎల్​ఓ .

ప్రతిభకు దక్కని పీఠం..

ప్రతిభ, అవకాశం..! ఈ రెండే ఎవరినైనా అత్యున్నత స్థాయిలో నిలబెడతాయి. కానీ... కరోనా కారణంగా...ప్రతిభ ఉన్న వారికీ అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సిన దుస్థితి నెలకొంది. వారి భవిష్యత్‌ని అగమ్యగోచరంగా మార్చింది...లాక్‌డౌన్. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయట పడి మళ్లీ సాధారణ జీవనం సాగించేలా ఉద్యోగం సంపాదించటం...వీరందరికీ కత్తిమీద సామే. ఇలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న విధివిధానాలు లేకపోవటం మరింత సమస్యాత్మకంగా మారింది. ముఖ్యంగా మధ్యాదాయ దేశాల్లో ఉద్యోగ భద్రత కల్పించటంపై పెద్దగా దృష్టి సారించటం లేదు. దాదాపు అన్ని ప్రభుత్వాలూ ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా ఏదైనా అనుకోని విపత్తు వచ్చినప్పుడు చిరుద్యోగులు చితికిపోవాల్సి వస్తోంది.

వారిని ఈ పనులకే వాడుతున్నారు !

ప్రస్తుతం లాక్‌డౌన్‌తో పనికి దూరమైన వారు మళ్లీ పనిలో చేరేందుకు అనువైన వాతావరణం సృష్టించటం కీలకమని సూచిస్తోంది...ఐఎల్‌ఓ. కరోనా అనుమానితులను గుర్తించటం, ఎక్కువ మొత్తంలో పరీక్షించటం లాంటి చర్యలు చేపడుతున్న దేశాల్లో పని గంటలు సగటున 50% తగ్గి పోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా...పని ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలన్న నిబంధన వల్ల చాలా మంది పనికి దూరమవుతున్నారు. అయితే...టెస్టింగ్ అండ్ ట్రేసింగ్‌ వల్ల ఉపాధి కోల్పోయిన వారితో పాటు... కొత్త ఉద్యోగావకాశాలు పొందుతున్న వారూ ఉన్నారు. ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించేందుకు యువతనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. తక్కువ వేతనాలు ఇస్తూ తాత్కాలికంగా ఈ పని చేసేందుకు నియమించుకుంటున్నారు.

ఇది ప్రతికూల పరిణామం..

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా పని గంటలు తగ్గిపోయాయని స్పష్టం చేసింది.. అంతర్జాతీయ కార్మిక సంస్థ. గతేడాది నాలుగో త్రైమాసికంతో పోల్చి చూస్తే ఇది ప్రతికూల పరిణామమేనని పేర్కొంది. తొలి త్రైమాసికంలో దాదాపు 4.8% మేర పని గంటల్లో కోత పడినట్లు తెలిపింది. దేశాల వారీగా చూస్తే... 2వ త్రైమాసికంలో అమెరికాలో 13.1%, ఐరోపా, మధ్య ఆసియాలో 12.9% మేర పని గంటలు తగ్గిపోయాయని వెల్లడించింది. సమస్య పరిష్కారానికి కొన్ని సూచనలూ చేసింది. ఆర్థిక, ఉపాధి రంగాలకు ఉద్దీపన అందించటం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వటం, ఉద్యోగాలు, ఆదాయాలకు భద్రత కల్పించటం, పని ప్రదేశాల్లో ఉద్యోగులకు రక్షణ ఇవ్వటం లాంటి అంశాలపై మేధోమథనం జరపాలని చెబుతోంది.

నిరుద్యోగం రేటు కొనసాగొచ్చు..

కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న అమెరికాలో నిరుద్యోగ సమస్య తారస్థాయికి చేరుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకుంటున్నప్పటికీ.. ఉద్యోగాల కోత మాత్రం ఆగడం లేదు. లక్షలాది మంది కొత్తగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఫలితంగా...ఇప్పటి వరకూ ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 4 కోట్లు దాటింది. ఏప్రిల్‌లో అమెరికాలో నిరుద్యోగిత రేటు 14.7%కి చేరింది. మహా మాంద్యం తర్వాత ఇదే అత్యధికం. రెండంకెల నిరుద్యోగిత రేటు 2021లోనూ కొనసాగొచ్చని అంచనా వేశారు. అయితే, అక్కడి కార్మిక విభాగం మరో ఆసక్తికర అంశం వెల్లడించింది. వైరస్‌ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో 2.5 కోట్ల మంది నిరుద్యోగ భృతి పొందారని.. ఇది ప్రస్తుతం 2.1 కోట్లకు చేరిందని తెలిపింది. అంటే కంపెనీలు తెరుచుకున్న తర్వాత ఉద్యోగులను తిరిగి నియమించుకుంటున్నట్లు అర్థమవుతోందని అభిప్రాయ పడింది.

కరోనా చేసిన గాయానికి మందుపూస్తున్నారు..

కరోనా సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లమంది శ్రామికుల జీవనోపాధికి ముప్పు ఏర్పడినట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ -ఐఎల్​ఓ గతంలో అంచనా వేసింది. ఈ లెక్కలు భయ పెడుతున్నప్పటికీ...కొన్ని దేశాలు ప్రత్యేక చొరవ చూపించి నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నాయి. వివిధ సంస్థల సిబ్బంది వేతనాల్లో 80% మేర బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది. తన వంతుగా అమెరికా 2 లక్షల కోట్ల డాలర్ల భారీ ప్యాకేజీలో భాగంగా లక్షలాది శ్రామికులకు సాయ పడుతోంది. ఆస్ట్రేలియాలో నిరుద్యోగ భృతిని రెట్టింపు చేశారు. జర్మనీ, ఫ్రాన్స్‌, సింగపూర్‌, యూఏఈ వంటివి చిన్న తరహా సంస్థలకు కొండంత అండగా నిలిచి ఔదార్యం చాటుకుంటున్నాయి. ఈ తరహా చర్యలు కరోనా చేసిన గాయానికి మందుపూసి కాస్త ఉపశమనం ఇస్తున్నాయి.

ఇదీ చూడండి.

విద్యార్థుల నుంచి కళాశాలల 'ఆన్‌లైన్‌ దోపిడీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.