కృష్ణాజిల్లా తిరువూరులో కరోనా లక్షణాలతో వృద్ధురాలు మృతి చెందిన ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న వృద్ధురాలు మృతి చెందింది. శవపరీక్ష నివేదికలో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వృద్ధురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మరో వైపు ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు, మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరువూరు పట్టణంలో దుకాణాలు మూసివేశారు. ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు, వారి వస్త్ర దుకాణంలో పనిచేసే సిబ్బంది, వస్త్రాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వీరికి కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నిషేధంతో టిక్‌టాక్ సంస్థకు రోజుకు ఎంత నష్టం?