విజయవాడ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న ఏపీఎస్పీ 16వ బెటాలియన్ పోలీసుల పరిస్థితి దయనీయంగా మారింది. తొలుత బెటాలియన్ వంట మనిషికి సోకిన కరోనా వైరస్ 24 మందికి వ్యాపించింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా వైద్యులు 11 మందికి మాత్రమే సోకిందని చెప్తున్నారని సిబ్బంది అంటున్నారు.
బెటాలియన్లో వైరస్ కలకలం నేపథ్యంలో రిలీవ్ ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి మూడో రోజు నుంచి విధులకు రమ్మని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. వైరస్ సోకినట్లు ఫోన్లో మెసేజ్ వచ్చినా వైద్యుల జాబితాలో పేర్లు లేకపోవటంతో అధికారులు విధులకు రమ్మంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 105 మంది ఉన్న బెటాలియన్ బృందానికి చిన్నపాటి ఇరుకు గదులున్న విమానాశ్రయ పాత విడిది కేటాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో మౌళిక వసతులు లేవని, చాలా అధ్వానంగా ఉందని వాపోయారు.
ఇదీ చూడండి