ETV Bharat / state

పల్లెలపై కరోనా పడగ..

కరోనా మహమ్మారి పట్నం నుంచి పల్లెలపై పడగ విప్పింది. గత నెల చివరి వారం నుంచి...... గ్రామల్లోనూ కొవిడ్ విజృంభిస్తోంది. నిత్యం కేసుల నమోదులో...... పట్టణాలను పల్లెలు మించిపోతున్నాయి. నగరాలు, పట్టణాల నుంచి వచ్చేవారి సంఖ్య పెరిగినా..... పల్లెవాసులు జాగ్రత్తలు తీసుకోకపోవడమే వైరస్ వ్యాప్తికి కారణమని.... అధికారులు చెబుతున్నారు..

corona cases increasing at villages
పల్లెలపై కరోనా పడగ
author img

By

Published : Sep 2, 2020, 10:45 AM IST

రాష్ట్రంలో కరోనా కేసుల నమోదులో సంఖ్యాపరంగా...... పట్టణాలను పల్లెలు మించిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి నిరోధానికి ముఖ్యమైన మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడంలో నెలకొన్న నిర్లిప్తత... పెనుప్రభావం చూపిస్తోంది. ఫలితంగా... కొద్దిరోజులుగా పట్టణాలు, నగరాల కన్నా పల్లెల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆగస్టు 19 వరకూ పట్టణాల్లో కేసులు ఎక్కువగా నమోదుకాగా... ఆ మరుసటి రోజు నుంచి పరిస్థితి మారింది. ఆగస్టు 1 నుంచి 19 వరకూ పట్టణాల్లో 52 శాతం, పల్లెల్లో 48 శాతం కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 23 నుంచి 29 వరకూ.... పట్టణాల్లో 44 శాతం, గ్రామాల్లో 56శాతం కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో... గరిష్ఠంగా 69 శాతం కేసులు నమోదయ్యాయి. నెలన్నరగా ఇక్కడ పరిస్థితి తిరగబడింది. విజయనగరం జిల్లాలో 67 శాతం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో 62 శాతం చొప్పున, కడప జిల్లా 61 శాతం కేసులు వెలుగుచూశాయి. ఒక్క విశాఖ జిల్లాలో మాత్రమే పట్టణాల్లో 77 శాతం కేసులు నమోదు కాగా...... పల్లెల్లో 23 శాతం కేసులు వెలుగుచూశాయి.

పల్లెలపై కరోనా పడగ

రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కూడా.... కొత్త ప్రాంతాలతో పోలిస్తే.... కంటైన్‌మెంట్‌ జోన్లలోనే అధికంగా ఉంది. ఆగస్టు 23 నుంచి 29 వరకూ.... కంటైన్‌మెంట్ జోన్లలో 69 వేల 299 కేసులు నమోదయ్యాయి. కొత్త ప్రదేశాల్లో 3 వేల 102 కేసులు బయటపడ్డాయి. పట్టణాలు, పల్లెల్లో మరణాల శాతం సమానంగా ఉంది. ఆగస్టు 23 నుంచి 29 మధ్య..... 597 మరణాలు రికార్డయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మరణాలు గ్రామాల్లో అధికంగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 69, విజయనగరం జిల్లాలో 63 శాతం చొప్పున మరణాలు..... పల్లెల్లోనే నమోదయ్యాయి.

లాక్‌డౌన్ తర్వాత రవాణా పునరుద్ధరించాక... వివిధ నగరాల నుంచి స్వస్థలాలకు వచ్చే వలసకూలీలు, ఉద్యోగుల సంఖ్య పెరిగింది. పైగా జాగ్రత్తలు తీసుకోవడంపై... పల్లెవాసులు దృష్టిపెట్టక పోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని..... అధికారులు అంటున్నారు. ఇప్పటికీ చావిడీల వద్ద, ఇళ్ల ముందు గుంపులు గుంపులుగా చేరుతున్నారు. పేకాట శిబిరాలు, విందులు కొనసాగుతున్నాయి. మద్యం దుకాణాల వద్ద బారులు కనిపిస్తున్నాయి. మాస్కులు ధరించడాన్ని కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఫలితంగా పల్లెల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చూడండి. ఎంత కష్టం...బతుకు పాఠం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.