కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అన్ని మండలాల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఉంగుటూరు మండలం పొణుకుమాడులో 59 ఏళ్ల వృద్ధుడు, మణికొండకు చెందిన 26 ఏళ్ల వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు తెలిపారు.
ఉంగుటూరు ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయినికి కరోనా వైరస్ సోకిందని...పాఠశాలకు ఐదు రోజులు సెలవులు ప్రకటిస్తూ అధికారుల నిర్ణయించారు. గన్నవరం మండలం గొల్లనపల్లిలోనూ ఓ కొవిడ్ మరణం సంభవించినట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: