కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా నూజివీడులో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. గాంధీనగర్లో వ్యాన్ డ్రైవర్ భార్యకు, పోతు రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ కు తాజాగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సబ్ కలెక్టర్ వివరించారు. విజయవాడ నుంచి కూరగాయలు తీసుకురావడంతోనే పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయవాడ నుంచి కూరగాయలు, సరకుల దిగుమతి చేయడాన్ని నిషేధించినట్లు తెలిపారు.
పట్టణానికి సమీపంలోని మైలవరం, తిరువూరు, ఏలూరు ప్రాంతాల నుంచి ప్రజలకు నిత్యావసర సరకులను సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పట్టణంలోని ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, ఇళ్ల వద్దకే సరకులన్నీ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఆగిరిపల్లి మండలం లో రెండు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, విజయవాడ నుండి వచ్చే ప్రతి వాహనాన్ని శానిటైజ్ చేయనున్నట్లు చెప్పారు. నూజివీడు పట్టణ పరిధిలోని 23,24,25,26,27,28 వార్డులను రెడ్ జోన్ గా ప్రకటించారు. ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: