Pending Funds:రుణం వచ్చినా.. రోడ్డు పనుల టెండర్లకు ససేమిరా - ఏపీ రోడ్ల టెండర్లు
pending funds: బ్యాంకు రుణం మంజూరవడంతో రహదారుల పునరుద్ధరణ పనులకు గుత్తేదారులు టెండర్లు వేస్తారని ఇంజినీర్లు భావిస్తే.. పలు జిల్లాల్లో గుత్తేదారులు ముందుకు రావడంలేదు. శని, సోమవారంతో కొన్ని జిల్లాల్లో టెండర్లు గడువు ముగియగా, చాలావాటికి బిడ్లు దాఖలు కాలేదు. దీంతో టెండర్ల గడువును మరో వారం పొడిగించారు.

pending funds: బ్యాంకు రుణం మంజూరు కావడంతో రహదారుల పునరుద్ధరణ పనులకు గుత్తేదారులు టెండర్లు వేస్తారని ఇంజినీర్లు భావిస్తే.. పలు జిల్లాల్లో గుత్తేదారులు ముందుకు రావడంలేదు. శని, సోమవారంతో కొన్ని జిల్లాల్లో టెండర్లు గడువు ముగియగా, చాలావాటికి బిడ్లు దాఖలు కాలేదు. దీంతో టెండర్ల గడువును మరోవారం పొడిగించారు. దెబ్బతిన్న 8,268 కి.మీ. రహదారులను రూ.2,205 కోట్లతో పునరుద్ధరించనున్నారు. ఇందుకు ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ (ఏపీఆర్‌డీసీ)కు రూ.2 వేల కోట్ల బ్యాంకు రుణం ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకొచ్చింది. ఈనెల 22న ఒప్పందం కూడా జరిగింది. దీంతో బిడ్లు దాఖలవుతాయని భావించారు.
అయిదు జిల్లాల్లో వెనకడుగు
మొత్తం 1,147 పనులకుగానూ గతంలో 308 పనులకే బిడ్లు వచ్చాయి. తాజాగా 839 పనులకు టెండర్లు పిలిస్తే అత్యధిక పనులకు బిడ్లు దాఖలు కాలేదని తెలిసింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నింటికి మాత్రమే బిడ్లు వచ్చాయి. గత ఏడాది వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయగా, వాటి బకాయిలు పూర్తిగా చెల్లించాలని గుత్తేదారులు పట్టుబడుతున్నారు. కేంద్ర రహదారి నిధి (సీఆర్‌ఎఫ్) కింద చేసిన పనులకు రూ.250 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పనులు ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాల్లో చేశారు.
వీటి సంగతి తేల్చాలని అక్కడి గుత్తేదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం టెండర్లు పిలిచిన పనుల అంచనాలను గతఏడాది రూపొందించగా, ఇపుడు వీటి నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అవి మరింత అధ్వానంగా మారడంతో నిర్మాణ వ్యయం ఎక్కువవుతుందని పేర్కొంటున్నారు. అయితే వర్షాల కారణంగా గుత్తేదారులు బిడ్లు వేయలేకపోయారని ఇంజినీర్లు చెబుతున్నారు. ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా చెల్లించేలా ప్రభుత్వ ఉత్తర్వు జారీ కానుందని తెలిపారు. బకాయిలు కూడా చెల్లించేలా చూస్తామన్నారు.
ఇదీ చదవండి: