ETV Bharat / state

ఫిషింగ్‌ హార్బర్లు, ఆక్వా హబ్‌ల నిర్మాణానికి నేడు శ్రీకారం

author img

By

Published : Nov 21, 2020, 5:09 AM IST

ఫిషింగ్‌ హార్బర్లు, ఆక్వా హబ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. తొలిదశలో నాలుగు, రెండో దశలో నాలుగు హార్బర్ల నిర్మాణానికి రూ.3వేల కోట్ల వెచ్చించనుంది. మొదటి విడతలో రూ.225 కోట్ల ఖర్చుతో 25 ఆక్వాహబ్‌లు కట్టనుంది.

Construction of fishing harbour and aqua hubs begins today
ఫిషింగ్‌ హార్బర్లు, ఆక్వా హబ్‌ల నిర్మాణానికి నేడు శ్రీకారం
ఫిషింగ్‌ హార్బర్లు, ఆక్వా హబ్‌ల నిర్మాణానికి నేడు శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌ల నిర్మాణానికి.... ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. తీర ప్రాంతంలో తొలిదశలో నిర్మించనున్న 4 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారు.

తొలివిడతలో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చేపట్టే ఫిషింగ్ హార్బర్ల కోసం... సుమారు 15 వందల 10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్‌ రెండో వారంలో టెండర్లను ఖరారు చేసి పనులను ప్రారంభిస్తామని వెల్లడించింది.

మలిదశలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపడతారు. అవసరమైన ప్రాంతాల్లో నియోజకవర్గానికో ఆక్వాహబ్‌ తలపెట్టగా... తొలిదశలో 25 హబ్‌ల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. వీటికోసం రూ.225 కోట్లు వ్యయమవుతుందని ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వం నిర్మించే ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లలో... లైవ్‌ ఫిష్, డ్రై చేసిన చేపలు, ప్రాసెస్‌ చేసిన చేపలు, రొయ్యలు, పీతలు సహా ఇతర మత్స్య ఉత్పత్తులు లభిస్తాయి. మత్స్య, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ హబ్‌లను జనతాబజార్లతో అనుసంధానం చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆక్వా రైతు సొసైటీలు ఈ హబ్‌లను నిర్వహిస్తాయి. సమీప ప్రాంత రైతులు, మత్స్యకారుల నుంచి చేపలు, రొయ్యలు సేకరించి... హబ్‌లకు, తద్వారా జనతాబజార్లకు సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండీ... 'ఉపాధి పెంపే లక్ష్యంగా ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ సెంటర్ల ఏర్పాటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.