ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, నాచురల్ గ్యాస్ శాఖ ఆధ్వర్యంలో... సంరక్షణ మహోత్సవం పేరిట సదస్సు నిర్వహించారు. ఇంధన పొదుపు, పర్యావరణరహిత ఇంధనాలు వాడకంపై నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నెల రోజులపాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పెట్రోల్ గ్యాస్ ఉత్పత్తులను జాగ్రత్తగా వాడుకుంటూ... దేశ అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. అనంతరం ఇంధన పొదుపుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఇవీ చూడండి...