ETV Bharat / state

అమరావతి ఉద్యమంపై కమిటీ ఏర్పాటు చేయాలి: పద్మశ్రీ - వైకాపా ప్రభుత్వంపై సుంకర పద్మశ్రీ ఆగ్రహం

అమరావతి ఉద్యమంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి దారుణమని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ అన్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలపై కమిటీని నియమించాలని ఆమె డిమాండ్ చేశారు.

congress leader sunkara padma sri fire on ycp government about amaravathi protest
కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ
author img

By

Published : Feb 27, 2021, 5:22 PM IST

ఆంధ్రప్రదేశ్​కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమంపై వైకాపా ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి దారుణమని అమరావతి మహిళా ఐకాస నేత, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పద్మశ్రీ... దిల్లీలో రైతుల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించి పలుమార్లు రైతులతో చర్చించిందన్నారు. రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న వారితో ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారైనా చర్చించారా అని ప్రశ్నించారు. రైతులతో సంప్రదింపులు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. అన్నదాతల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్న సంగతి సీఎం జగన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ఇదీచదవండి

తెదేపా సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.