కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం బోడ్డపాడు గ్రామంలో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య వివాదం తలెత్తింది. తెలుగుదేశం పార్టీ బలపర్చిన సర్పంచి మోడే శివశంకర్పై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. అర్హత లేని వారికి ఇళ్లు ఇచ్చారని.. తెదేపా సానుభూతిపరులకు అర్హత ఉన్నా.. ఇళ్ల స్థలాలు ఇవ్వడంలేదని సర్పంచి ప్రశ్నించారు. ఈ నెపంతో ఉదయం వాకింగ్ చేస్తున్న సర్పంచిపై వైకాపా గ్రామ నాయకులు దాడి చేశారు.
దాడికి పాల్పడ్డ వైకాపా నాయకులపై సర్పంచి పోలీసులకు పిర్యాదు చేశారు. దాడిలో సర్పంచి సహా మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. సర్పంచి వర్గీయులే తమపై దాడి చేశారని వైకాపా నాయకులు ఆరోపించారు. వైకాపా కార్యకర్తల్లో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇరు పార్టీలకు చెందిన మండల స్థాయి నాయకులు పోలీసు స్టేషన్ వద్ద భారీగా చేరుకున్నారు. తోట్లవల్లూరు సీఐ ముక్తేశ్వరరావు, ఎస్ఐ అర్జున్ విచారణ చేపట్టారు.
ఇదీ చదవండీ... AFFIDAVIT IN SC: పది, ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్