ETV Bharat / state

అమరావతి రైతుల ఆందోళనలు @ 250 - విజయవాడలో అమరావతి జేఏసీ నిరసన

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న దీక్షలు 250వ రోజుకు చేరింది. ఆందోళనలకు మద్దతుగా 'రాజ్యాంగాన్ని గౌరవిద్దాం .. అమరావతిని కాపాడుకుందాం' అంటూ... అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

Concerns of Amravati farmers reaching 250th day
అంబేడ్కర్, న్యాయదేవత చిత్రపటాలకు వినతిపత్రం అందజేత
author img

By

Published : Aug 23, 2020, 4:11 PM IST

అమరావతి రాజధాని రైతుల నిరసనలు 250వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 'రాజ్యాంగాన్ని గౌరవిద్దాం .. అమరావతిని కాపాడుకుందాం' అంటూ సమావేశం నిర్వహించారు. విజయవాడలోని జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్, న్యాయదేవత చిత్రపటాలకు వినతిపత్రం అందజేశారు.

రాజధాని ఉద్యమం కేవలం 29 గ్రామాలది కాదని, రాష్ట్ర ప్రజలందరిదీ అని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు అమరావతికి మద్దతు పలికిన సీఎం జగన్.. నేడు మాట మార్చటం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

ఇవీ చదవండి:

'ఆలకించు ఆంధ్రుడా.. అమరావతి అన్నదాత ఆక్రందన'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.