ఆర్టీసీలో కారుణ్య నియామకాల అభ్యర్థులకు తక్షణమే తమ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఆర్టీసీలో పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కారుణ్య నియామకాలను గతేడాది నుంచి చేపడుతున్నామని చెప్పిన యాజమాన్యం.. ఇప్పుడు వివిధ కారణాలతో ఉద్యోగాలు లేవని చెబుతున్నారని అభ్యర్థులు వాపోయారు. ఇప్పటికే పలుమార్లు ఆర్టీసీ ఎండీ , రవాణా శాఖ మంత్రి పేర్ని నానిని కలిసి వినతి పత్రం ఇచ్చినా తమ సమస్యలు పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ పెద్దను కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోవడంతోనే తాము ఆందోళన చేపట్టామన్నారు. బస్సులను నిలువరించి ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: