కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదవుటపల్లిలో కొత్త రకం మోసానికి తెరలేసింది. నకిలీ పత్రాలతో ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థికసాయం పొందాలని ఓ వ్యక్తి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళ్లితే.. చెల్లెలికి పిల్లలు లేరని ఈశ్వరరావు అనే వ్యక్తి తన కుమార్తెను ఇచ్చాడు. ఇటీవల కరోనా కారణంగా అతని చెల్లెలు, బావ మృతి చెందారు.
తన కుమార్తె ప్రియాంకను తన చెల్లి కుమార్తెగా నకిలీ పత్రాలను ఈశ్వర్ సృష్టించాడు. ప్రియాంకను అనాథగా గుర్తించిన ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. మరోసారి పత్రాలు తనిఖీ చేయాలని కలెక్టర్.. అధికారులను ఆదేశించారు. తనిఖీలో ప్రియాంక ధ్రువపత్రాలు నకిలీవిగా అధికారులు గుర్తించారు. కలెక్టర్ ఆదేశాలతో ఉంగుటూరు తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: Jagan Delhi Tour: దిల్లీకి సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ