ETV Bharat / state

తెలంగాణ : కేటీఆర్​పై హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ - latest complaint on ktr

దివ్యాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్​పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల సెల్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. తక్షణమే తన మాటలను వెనక్కు తీసుకొవాలని.. దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ : కేటీఆర్​పై హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

author img

By

Published : Dec 10, 2020, 9:53 PM IST

దివ్యాంగుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి కేటీఆర్​పై చర్యలు తీసుకోవాలంటూ.. కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల సెల్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేసింది. ఇటీవల ఓ టీవీ ఛానెల్​కు కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంలో ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ.. గుడ్డి ద్వేషం ఎందుకు, గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారా అంటూ మాట్లాడినట్లు దివ్యాంగుల సెల్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య తన పిటిషన్​లో పేర్కొన్నారు.

ఆ మాటలు వికలాంగుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉన్నాయని కమిషన్​కు వివరించారు. దివ్యాంగుల హక్కులను కాపాడాలని కోరారు. దివ్యాంగుల జాతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్​పై చర్యలు తీసుకోవాలని కమిషన్​కు విజ్ఞప్తి చేశారు. తక్షణమే తన మాటలను వెనక్కు తీసుకొని.. దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: గేట్స్​ ఫౌండేషన్ మరో భారీ సాయం ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.