కృష్ణా జిల్లా నందివాడ మండలం లక్ష్మీనరసింహాపురంలో రంగు బియ్యం కలకలం రేపాయి. పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించే బియ్యం గోధుమ రంగులో ఉండటంతో స్థానికులు ఆందోళన చెందారు. కల్తీ బియ్యం అనే అనుమానంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి పిల్లలకు ప్రొటీన్ కోసం మాములు బియ్యంలో కొన్ని బ్రౌన్ రైస్ కలుపుతారని వివరణ ఇచ్చారు. అయితే గ్రామస్థుల అనుమానం నివృత్తి కోసం రంగు బియ్యాన్ని పరిశీలనకు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి...