ETV Bharat / state

'రెండు నెలల్లో అండర్ పాస్ పూర్తి చేస్తాం'

విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలో జ్యోతి మహల్ కూడలి వద్ద నిర్మించనున్న అండర్ పాస్ నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.

కలెక్టర్
author img

By

Published : Sep 15, 2019, 12:51 PM IST

రెండు నెలల్లో అండర్ పాస్ పూర్తి చేస్తాం

జాతీయ రహదారుల సంస్థ అధికారులతో కలిసి విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని అండర్ పాస్ నిర్మించనున్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. అండర్ పాస్ నిర్మాణంపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారిస్తూ....ఇటీవల కలెక్టర్ జాతీయ రహదారుల సంస్థ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడంతో.... అధికారులు నేటి నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. 15 మీటర్ల వెడల్పు, 5.2 మీటర్ల ఎత్తులో అండర్ పాస్ నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి కానుందని కలెక్టర్ వివరించారు. నిర్మాణం పూర్తైతే యనమలకుదురు, పకీర్ గూడెం ప్రాంత వాసులు చుట్టూ తిరిగే పని లేకుండా తమ గమ్యానికి చేరుకోవచ్చన్నారు. పైవంతెన నిర్మాణ పనులు కూడా కొలిక్కి రానున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి.

ఆర్థిక సాయం పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

Intro:222Body:666Conclusion:కడప జిల్లా బద్వేలు లోని వినాయక నగర్ లో అపశృతి చోటు చేసుకుంది. వినాయకుని బొమ్మ పెట్టిన చోట విద్యుత్ తీగలు తగలడంతో మంటలు లేచాయి దీంతో వెంటనే స్థానికులు గమనించి నీళ్లు పోసి మాటలన్నారు సకాలంలో ప్రజలు గమనించి మంటలు ఆర్పడం తో అగ్ని ప్రమాదం తప్పింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.