ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. ప్రస్తుత సబ్ కలెక్టర్ కార్యాలయ భవనాలల్లో అందుబాటులో ఉన్న వివిధ గదులతో నూతన కలెక్టర్ కార్యాలయానికి అనువుగా మార్పులు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి కార్యాలయాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి:
'పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు ఎన్ని చెప్పులతో కొట్టుకున్నారు'