కొవిడ్ -19 వైరస్ నియంత్రణకు డాక్టర్స్ ఫర్ యు అనే స్వచ్ఛంద సంస్థ, హెచ్సీఎల్ ఫౌండేషన్ సంయుక్తంగా వైద్య పరికరాలు అందించాయని.. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరమని అన్నారు. జిల్లాలోని వివిధ ఆసుపత్రులకు వైద్య పరికరాలు తరలించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. గుడివాడ ప్రాంతీయ ఆసుపత్రిలో, మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో 100 ఐసీయూ బెడ్లు, 2 వెంటిలేటర్స్ , 20 ఆక్సిజన్ సిలిండర్లు, 20 డిజిటల్ బీపీ పరికరాలు, 50 పల్స్ ఆక్సో యంత్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని ద్వారా జిల్లాలోని పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత అందుబాటులోనికి వస్తాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి... సీఎం నివాస ప్రాంతంలో పెరుగుతున్న కరోనా కేసులు