ETV Bharat / state

అవనిగడ్డలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ - mla simhadri ramesh babu latest news

కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక మండలాలకు చెందిన 52 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.56 లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.

cmrf cheques distributed in avanigadda
అవనిగడ్డలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
author img

By

Published : Mar 23, 2021, 8:03 PM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక మండలాలకు చెందిన 52 మంది లబ్దిదారులకు రూ.19 లక్షల 47 వేలు విలువ చేసే చెక్కులను అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పంపిణీ చేశారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం కూడా చేయించుకొలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తోందని ఆయన అన్నారు.

నియోజకవర్గంలోని 6 మండలాలకు.. దాదాపు రూ.56 లక్షలకు పైచిలుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులు మంజూరు అయ్యాయని చెప్పారు. దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు, అవనిగడ్డ పంచాయతీ సర్పంచ్ గొర్రుముచ్చు ఉమా, స్థానిక వైకాపా నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కరోనాతో అప్రమత్తం..

రాష్ట్రంలో కరోనా రెండో దశ కోరలు చాస్తున్న తరుణంలో నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సూచించారు. బయటకు వెళ్లేప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. శానిటేషన్ చేసుకోవడం మర్చిపోవద్దని తెలిపారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినందున 45 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇదీ చదవండి:

అమ్మఒడి పథకం పేరుతో ఫోన్ చేశారు.. రూ. 13 వేలు కాజేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.