ETV Bharat / state

త్వరలో 'వైఎస్సార్​ చిరునవ్వు' ప్రారంభం

author img

By

Published : Feb 28, 2020, 4:35 PM IST

జూలై 8వ తేదీన 'వైఎస్సార్​ చిరునవ్వు' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం జగన్ ఆరోగ్య శాఖ సమీక్షలో వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా 1 నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు ఉచిత దంత వైద్యం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థికి బ్రష్​తో పాటు టూత్ పేస్టును అందించనున్నామన్నారు.

త్వరలో వైయస్​ఆర్ చిరునవ్వు కార్యక్రమం ప్రారంభం

'వైఎస్సార్​ చిరునవ్వు' కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక వైద్య పరీక్ష కేంద్రాల్లో దంత పరీక్షలు చేయనున్నట్లు సీఎం జగన్​ తెలిపారు. ఆరోగ్యశాఖపై సీఎం సమీక్షించారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 60 లక్షల మంది చిన్నారులను స్క్రీనింగ్‌ చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు పూర్తిగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు వేల జనాభా ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్ధితులకు తగినట్లుగా విలేజ్‌ క్లినిక్‌ అందుబాటులో ఉంచాలన్నారు. వైఎస్సార్​ విలేజ్‌ క్లినిక్‌లో 24 గంటలు ఒక బీఎస్సీ నర్సింగ్‌ చదివిన స్టాఫ్‌ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతీ గ్రామ, వార్డు సచివాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వైఎస్సార్ విలేజ్‌ క్లినిక్‌ అందుబాటులో ఉండాలని సూచించారు. రోగికి ఏదైనా జరిగితే వెంటనే అక్కడికి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుందనే విధంగా విలేజ్‌ క్లినిక్‌ ఉండాలని తెలిపారు. చిన్న చిన్న సమస్యలకు అక్కడికక్కడే చికిత్స చేసి మందులు ఇవ్వడంతో పాటు పెద్ద సమస్యలకు రెఫరల్‌ పాయింట్‌గా పనిచేయాలని తెలిపారు. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో 25 టీచింగ్‌ హాస్పిటల్స్‌ ఉండాలని ఆదేశించారు.

ఇవీ చదవండి

'సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.