ETV Bharat / state

పార్టీపై విశ్వాసంతో గెలిపించారు.. నల్గొండలో ప్రగతి పరుగులు తీయాలి: తెలంగాణ సీఎం కేసీఆర్

CM KCR on Nalgonda development : ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రగతి పరుగులు తీయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులకు సూచించారు. వారంలోపు మునుగోడును సందర్శించి అక్కడే సమీక్ష ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అభివృద్ధిని తానే స్వయంగా సమీక్షిస్తానన్న సీఎం.. సమస్యలన్నీ పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. పాత ఎమ్మెల్యేకు.. ప్రభాకర్​రెడ్డికి మధ్య పనుల్లో తేడా కనిపించాలని సూచించారు.

సీఎం కేసీఆర్​ను కలిసిన కూసుకుంట్ల
సీఎం కేసీఆర్​ను కలిసిన కూసుకుంట్ల
author img

By

Published : Nov 8, 2022, 10:30 AM IST

నల్గొండలో ప్రగతి పరుగులు తీయాలి: తెలంగాణ సీఎం కేసీఆర్

CM KCR on Nalgonda development: ఉమ్మడి నల్గొండ జిల్లాను తమకు కంచుకోటగా మార్చిన ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి రుణపడి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. ఇక నుంచి జిల్లాలో ప్రగతి పరుగులు తీయాలన్న సీఎం.. తానే స్వయంగా అభివృద్ధిని పర్యవేక్షిస్తానని తెలిపారు. వారం రోజులలోపు పురపాలక, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు.. గిరిజన సంక్షేమ శాఖల మంత్రులు మునుగోడును సందర్శించి అక్కడే ఉమ్మడి జిల్లా సమీక్ష ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. అభివృద్ధి పనులను వెంటనే ఖరారు చేసి టెండర్లు పిలవాలని.. నెలరోజుల్లోపే వాటిని ప్రారంభించాలని సూచించారు. రహదారులతో పాటు గ్రామాలు, పట్టణాలు, గిరిజన తండాల్లో సమస్యలన్నీ పరిష్కారం కావాలని సీఎం స్పష్టం చేశారు. మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీశ్​రెడ్డికి సూచించారు.

kusukuntla Prabhakar Reddy Met CM KCR..: మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి, మంత్రి జగదీశ్​రెడ్డి, పలువురు నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్​ను ప్రగతి భవన్​లో కలిశారు. ఈ సందర్భంగా కూసుకుంట్లను సీఎం సత్కరించారు. భారత్​ రాష్ట్ర సమితికి భారీ ఓట్లతో మునుగోడు ప్రజలు సద్ది కట్టారని.. ద్విగుణీకృత ఉత్సాహంతో దేశంలో గుణాత్మక మార్పు కోసం ముందడుగు వేస్తామని చెప్పారు. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్న కేసీఆర్.. తెరాసపై, నాయకత్వంపై విశ్వాసంతో అభ్యర్థిని గెలిపించారని అన్నారు. ఎన్నికల్లో మెజారిటీ పది వేల ఓట్లే అని అసంతృప్తి చెందవద్దన్న సీఎం.. భాజపా భారీ ఎత్తున డబ్బు వెచ్చించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి తీవ్ర ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ఈ ఆధిక్యత కూడా ఘనమైందేనని కేసీఆర్​ అన్నారు. రోడ్డు రోలర్, రోటీ మేకర్​ తదితర గుర్తులకు వచ్చిన దాదాపు 7 వేల ఓట్లు కూడా మనవేనని కేసీఆర్ అన్నారు.

పాత ఎమ్మెల్యేకు.. ప్రభాకర్​రెడ్డికి మధ్య తేడా కనిపించాలి..: ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ శ్రేణులు అద్భుతంగా పని చేశాయన్న సీఎం కేసీఆర్​.. వామపక్షాలు సంపూర్ణ సహకారం అందించాయన్నారు. పాత ఎమ్మెల్యేకు.. ప్రభాకర్​రెడ్డికి మధ్య పనుల్లో తేడా కనిపించాలని సూచించారు. మునుగోడు సహా ఉమ్మడి నల్గొండ అభివృద్ధికి వెంటనే కార్యాచరణ ప్రారంభించాలన్న కేసీఆర్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. నియోజకవర్గ ప్రచారంలో తమ దృష్టికి వచ్చిన అంశాలన్నింటిపైనా మంత్రులు సమీక్షించాలని సూచించారు. నీటి పారుదల ప్రాజెక్టులు వేగం పుంజుకోవాలని.. పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసిన వెంటనే ఆర్థిక శాఖ నిధులు ఇస్తుందని సీఎం తెలిపారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.