CM JAGAN TOUR వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం నాలుగో విడత నిధులను నేడు ప్రభుత్వం విడుదల చేయనుంది. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల 546 మంది చేనేతలకు.. 193.31 కోట్లు అందించనున్నారు. ఈనిధులతో కలిపి ఇప్పటివరకూ నేతన్నలకు.. ఈ పథకం ద్వారా 776.13 కోట్లు సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24వేలు ఆర్థిక సాయం చేస్తున్నామంది. నేతన్నల పెన్షన్ కోసం 879.8 కోట్లు, ఆప్కోకు 393.3 కోట్లు కలిపి మొత్తంగా మూడేళ్లలో నేతన్నల సంక్షేమం కోసం 2,049.2 కోట్లు చెల్లించినట్లు వివరించింది.
ఇవీ చదవండి: