ETV Bharat / state

'రాష్ట్రంలో 3 మేజర్ పోర్టుల నిర్మాణానికి యత్నం' - CM jagan said that efforts are being made to build 3 major ports in the state

పశు సంవర్థక, మత్స్య శాఖలో ఉన్న పలు సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. మచిలీపట్నంను మేజర్ పోర్టుగా తీర్చిదిద్దడం సహా, పలు చోట్ల జెట్టీల నిర్మాణం, ఆక్వా సాగు ప్రాంతాల్లో ల్యాబ్​ల ఏర్పాటు, పశువులకు హెల్త్​ కార్డులు వంటి వాటిపై జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జగన్
author img

By

Published : Sep 20, 2019, 5:47 PM IST

సీఎం జగన్ సమీక్ష
పశు సంవర్థక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. శాఖల్లో ఉన్నటువంటి పలు సమస్యల పరిష్కారంపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో 3 మేజర్‌ పోర్టుల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నామన్న సీఎం మచిలీపట్నాన్ని మేజర్‌ పోర్టుగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌పై ఒత్తిడి తగ్గించాల్సి ఉందని అందులో భాగంగా భీమిలి సమీపాన ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపై సమాలోచనలు చేశారు. మత్స్యకారులు కోరుతున్న ప్రాంతాల్లో జట్టీలు, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణాలు చేయాలని చెప్పారు. చేపలు, రొయ్యలు పెంచుతున్న ప్రాంతాల్లో ల్యాబ్ ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. వేటకు అవసరమైన సదుపాయాలు కల్పించి గుజరాత్​కు వలస వెళ్లిన మత్స్యకార కుటుంబాలను తిరిగి రాష్ట్రానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీడ్, ఫీడ్‌ల్లో నాణ్యత ఉండాలని అధికారులకు స్పష్టం చేసిన సీఎం.. కల్తీ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో హేచరీ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు అనుమతిలిచ్చారని దీని వల్ల వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయని సీఎం చెప్పారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి ఒక విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంపై ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు, సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పశువులకూ హెల్త్​ కార్డులు
జనవరిని రిక్రూట్‌మెంట్‌ నెలగా చేసుకోవాలని.. ఖాళీల భర్తీకి జనవరి నెలను వాడుకోవాలని అధికారులను ఆదేశించారు. వెటర్నరీ ఆస్పత్రులు, క్లినిక్​లలో సదుపాయాలను కల్పించాలన్నారు. పశువులకూ హెల్త్‌కార్డును ఇవ్వాలని దీనివల్ల క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. పశువుల మందులు కొనుగోలులో ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీ కార్ల్‌ను లక్ష్యాలకు అనుగుణంగా నడపాలని సూచించారు. పులివెందులలో ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధి కోసం బ్రీడింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కరవు బాధిత ప్రాంతాల్లో పశువులకు ఆహార సమస్య లేకుండా చేయడానికి స్థిరమైన, శాశ్వతమైన విధానాలు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. పశువుల వైద్యం కోసం 102 వాహనాలు, వచ్చే ఏడాది నుంచి తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.

Intro:ap_knl_14_11_new_otars_av_c1
ఎలక్షన్ లో ఓటు వేసేందుకుయువ వోటర్లు ఎంతో ఆసక్తి చూపుతున్నారు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని కొత్తగా ఓట్లు వచ్చిన యువతీ యువకులు క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కర్నూల్ లో యువ ఓటర్లు ఓట్లు వేసేందుకు అసత్తి చూపుతున్నారు. విజువల్స్

Body:ap_knl_14_11_new_otars_av_c1

Conclusion:ap_knl_14_11_new_otars_av_c1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.