ETV Bharat / state

ఉద్యోగాలంటారు ఉసూరుమనిపిస్తారు! జాబ్‌ క్యాలెండర్‌ను పట్టించుకోని ప్రభుత్వం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 8:29 AM IST

CM Jagan Job Calendar : రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న సీఎం జగన్.. మాట తప్పి, మడమ తిప్పి నిరుద్యోగ యువత ఆకాంక్షలను నిలువునా తొక్కేశారు.

cm_jagan_job_calendar
cm_jagan_job_calendar

CM Jagan Job Calendar : "రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం... నేడే 2021-22 జాబ్‌ క్యాలెండర్‌ విడుదల... ప్రతి నెలా నోటిఫికేషన్ల ద్వారా పారదర్శకంగా నియామకాలు.." 2021 జూన్‌ 18న సీఎం జగన్‌ ఆర్భాటంగా చేసిన ప్రకటనలివి. కానీ నాడు ఇచ్చిన మాట తప్పి, మడమ తిప్పి నిరుద్యోగ యువత ఆకాంక్షలను జగన్‌ నిలువునా తొక్కేశారు. నోటిఫికేషన్లు ఇస్తామంటూ ఏపీపీఎస్సీ ఈ నెలలో ప్రకటించినా.. అది కార్యరూపం దాలుస్తుందా అని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టులు తక్కువగా ఉండటం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ అంతా తప్పుల తడక, కుట్రపూరితం! పోస్టులు అమ్ముకోవడానికి వైసీపీ కుట్ర చేస్తోంది: సప్తగిరి ప్రసాద్‌

జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసి రెండేళ్లు దాటినప్పటికీ.. అందులో పేర్కొన్న గ్రూపు-2, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్లు ఇప్పటికీ జారీ కాలేదు. 2021లో జారీచేసిన ‘క్యాలెండర్‌’లో పేర్కొన్న ప్రకారం... ఆ ఏడాది ఆగస్టులో గ్రూపు-2 నోటిఫికేషన్, 2022 జనవరిలో డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడాలి. ఆశావహులు ఎంతగా వేచిచూసినా ఫలితం లేకపోయింది. ఈ పోస్టుల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించగా.. ఇన్నిరోజులు జాప్యం చేసినా పోస్టుల పెంపు అంతంత మాత్రమే. గ్రూపు-1, గ్రూపు-2 కింద 36 పోస్టులను భర్తీ చేస్తామని 2021లో ప్రభుత్వం ప్రకటించగా.. ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉన్నందున నిరుద్యోగులు గగ్గోలు పెట్టారు. దీంతో 2022 సెప్టెంబరులో గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్‌ వెలువడగా నియామకాలు జరిగాయి. గ్రూపు-2 పోస్టుల్ని పెంచేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు సాగుతూనే ఉండగా.. నిరుద్యోగుల తీవ్ర నిరసనల మధ్య ఈ ఏడాది మే 25న గ్రూపు-1 కింద 100, గ్రూపు-2 కింద 900 పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు ప్రకటన వెలువడినప్పటికీ... ఇప్పటికీ నోటిఫికేషన్లు రాలేదు.

Jobs to Btech Students In AP: అరకొర చదువుతో.. కొలువులు అంతంత మాత్రమే..!

ప్రభుత్వ శాఖల్లో సుమారు 66 వేల 309 ఖాళీలున్నాయి. పాఠశాల విద్యాశాఖలో 2 లక్షల 20 వేల 266 పోస్టులకు లక్షా 73 వేల 713 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉన్నత విద్యాశాఖలో 15 వేల 818 పోస్టులకు 5 వేల 193 మందే ఉన్నారు. వ్యవసాయ సహకార శాఖలో 11 వేల 329కి 6 వేల 906, సాంఘిక సంక్షేమ శాఖలో 16 వేల 598కి 10 వేల 160 మంది చొప్పున ఉన్నారు. ఖాళీల భర్తీకి ఒక నోటిఫికేషన్‌ వెలువడితే మళ్లీ కొత్తది వచ్చేందుకు ఏళ్ల తరబడి ఆలస్యమవుతోంది. ‘నోటిఫికేషన్ల జారీలో ఇకపై జాప్యం ఉండదని, తమ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల ఎదురుచూపులు ఉండవని... ధైర్యం కోల్పోతున్న యువతలో మార్పు తెస్తామంటూ 2021లో సీఎం జగన్‌ చేసిన ప్రకటన తప్పని రుజువైంది. డిగ్రీ కళాశాలల్లో 240 అధ్యాపకుల పోస్టులు భర్తీ చేస్తామని... అదే ఏడాది ప్రకటించినా నోటిఫికేషన్‌ రానేలేదు. ఈ నెలలో నోటిఫికేషన్‌ ఇస్తామంటున్నారు. అప్పటికీ... ఇప్పటికీ అదనంగా పెరిగిన పోస్టులు 27 మాత్రమే. తాజాగా 1603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తామని.. ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇందులో గ్రూపు-1 కింద 89, గ్రూపు-2 ఉద్యోగాలు 900 ఉన్నాయి.

ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యేకొద్దీ వయసు రీత్యా ఎంతో మంది అనర్హులవుతున్నారు. ఈ నేపథ్యంలో 34 ఏళ్ల వయో పరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఈ ఏడాది సెప్టెంబరు 30తో ఆ గడువు ముగిసింది. ఆ వెసులుబాటును వచ్చే ఏడాది సెప్టెంబరు దాకా పొడిగిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ‘క్యాలెండర్‌’లో పేర్కొన్న ప్రకారం నోటిఫికేషన్ల జారీ లేనందున వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Hello Lokesh Program with Students And Youth: టీడీపీ అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.